|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో: ఆకాశంలో మెరిసిన వండర్.. వెక్నా, ఎలెవన్ మాయాజాలం!

Published: 01-01-2026, 5:30 AM
స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో: ఆకాశంలో మెరిసిన వండర్.. వెక్నా, ఎలెవన్ మాయాజాలం!
  • అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో అద్భుతం.
  • వేల డ్రోన్‌లతో ఆకాశంలో ఎలెవెన్, వెక్నా, అప్‌సైడ్ డౌన్ విజువల్స్ రూపొందించారు.
  • ప్రపంచవ్యాప్త అభిమానులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
  • స్ట్రేంజర్ థింగ్స్ చివరి (ఐదో) సీజన్ న్యూ ఇయర్ ఈవ్ రోజున నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

లాస్ వెగాస్‌లో జరిగిన స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో ప్రపంచవ్యాప్త అభిమానులను అబ్బురపరిచింది. వేల డ్రోన్‌లతో ఆకాశంలో సృష్టించిన ఎలెవెన్, వెక్నా లాంటి విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ అద్భుత ప్రదర్శన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఆకాశంలో స్ట్రేంజర్ థింగ్స్ మాయాజాలం

Stranger Things drone show: అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో జరిగిన స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అద్భుతమైన షోను చూసిన వాళ్లు.. మా కళ్ళని మేము నమ్మలేకపోయాము.. అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న Stranger Things సిరీస్‌కి ఇది ఒక ప్రత్యేకమైన సెలబ్రేషన్‌గా నిలిచింది. ఈ సిరీస్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఈ సిరీస్ కోసం జరిగిన ఈ..స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో కూడా సోషల్ మీడియాలో అంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది

ఈ డ్రోన్ షోలో వేల సంఖ్యలో డ్రోన్లను ఒకే సమయానికి ఆకాశంలోకి ఎగరవేసి.. సిరీస్‌లోని గుర్తుండిపోయే సన్నివేశాలను రూపొందించారు. ఎలెవెన్, వెక్నా, అప్‌సైడ్ డౌన్ లాంటి విజువల్స్‌ను ఆకాశంలో వెలిగించారు. రాత్రి ఆకాశం మొత్తం రంగుల కాంతులతో నిండిపోయి.. అభిమానులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమం Las Vegas నగరానికి మరింత ఆకర్షణగా మారింది. ముఖ్యంగా ఈ సిరీస్ అభిమానులు.. ఈ దృశ్యాలను చూసి తెగ సంతోషపడ్డారు. ఇలా ఎప్పుడూ చూడలేదు ఇంకెప్పుడూ చూడబోమో అని.. సోషల్ మీడియాలో ఈ షో కి సంబంధించిన వీడియోలు.. షేర్ చేస్తూ.. కామెంట్లు కూడా పెట్ట సాగారు.

దాదాపు పదేళ్లుగా ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ సిరీస్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంటోంది. ఐదో సీజన్‌నే చివరి సీజన్‌గా ప్రకటించారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌లు విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. మిగిలిన ఎపిసోడ్‌లు కూడా విడుదలై ఈ కొత్త సంవత్సరంలో ఈ సిరీస్ ముగియనుంది.

అభిమానులను ఆకట్టుకున్న అద్భుత దృశ్యాలు

ఐదో సీజన్ కథ 1987 కాలంలో జరుగుతుంది. హాకిన్స్ పట్టణంలో జరిగిన రిఫ్ట్స్ వల్ల అక్కడి పరిస్థితులు మారిపోతాయి. మళ్లీ ప్రధాన పాత్రలన్నీ కలిసి తమ శత్రువు వెక్నాను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాయి. అదే సమయంలో ప్రభుత్వ బలగాల కదలికలు పెరగడం, ఎలెవెన్ కోసం వెతకడం కథలో టెన్షన్‌ను పెంచుతుంది. విల్ మాయం అయిన రోజు గుర్తు రావడం కూడా భావోద్వేగాలను రేకెత్తిస్తుంది.

ఈ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్ న్యూ ఇయర్ ఈవ్ రోజున విడుదల చేశారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లతో ఈ సీజన్ ముగుస్తుంది. చివరి ఎపిసోడ్ దాదాపు రెండు గంటల పాటు.. ఎన్నో ట్విస్టులతో నిండి ఉంటుంది అని ఇప్పటికే చిత్ర బృందం తెలిపారు. థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇంట్లో నుంచే Netflix లో చూసే అవకాశం ఉంది.

ముగింపు దశకు చేరుకున్న సిరీస్ కథనం

డ్రోన్ షోతో మొదలైన ఈ హైప్.. ఫైనల్ ఎపిసోడ్ విడుదలతో మరింత రెట్టింపు కానుంది. మొత్తానికి స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ టీవీ చరిత్రలో ఒక గుర్తుండిపోయే అధ్యాయంగా నిలవడం ఖాయం. అభిమానుల కోసం ఇది నిజంగా ఒక మరిచిపోలేని అనుభవం అని చెప్పవచ్చు.

స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో సృష్టించిన ఉత్సాహం, చివరి సీజన్ విడుదల మరింత పెంచాయి. ఈ సిరీస్ ముగింపు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఇది టీవీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.