
📌 Key Points
- బాలీవుడ్ వర్క్ కల్చర్ పై స్వీడిష్ నటి ఎల్లీ అవ్రామ్ సంచలన వ్యాఖ్యలు
- హిందీ చిత్ర పరిశ్రమలో మానవత్వం లేదని, నటీనటులను పట్టించుకోరని ఆరోపణ
- సౌత్ సినిమాల్లో పని చేయడం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఎల్లీ ప్రశంస
- బాలీవుడ్ మేకర్స్ ప్రతిభను తొక్కిపెడతారని, గ్లామర్ బొమ్మలకే పరిమితం చేస్తారని విమర్శ
స్వీడిష్ నటి ఎల్లీ అవ్రామ్ బాలీవుడ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌లో నటీనటుల పట్ల వివక్ష ఉందని, సౌత్ సినీ పరిశ్రమలో పని వాతావరణం ఎంతో బాగుందని ఆమె పేర్కొంది.
బాలీవుడ్‌లో దారుణ పరిస్థితులు: ఎల్లీ అవ్రామ్
Elli AvrRam :ఇండస్ట్రీలో కనిపించే వెలుగులే కాదు కనిపించని చీకట్లు కూడా చాలా ఉంటాయని మరోసారి తేలిపోయింది. అయితే ఈసారి మన వాళ్ళ గొప్పల్ని, తప్పుల్ని మనవాళ్ళు కాకుండా ఫారిన్ భామ, స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ బయట పెట్టడం విశేషం. మరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అందం బయటపెట్టిన ఆ డార్క్ షేడ్స్ అండ్ గుడ్ థింగ్స్ ఏంటో చూసేద్దాం.
హిందీ మేకర్స్ కు అసలు మానవత్వం లేదు
ఎల్లీ అవ్రామ్ మాట్లాడుతూ హిందీ మేకర్స్ కు అసలు మానవత్వం లేదని, అక్కడ పని చేసే వారు చచ్చినా పట్టించుకోరంటూ చెప్పుకొచ్చింది. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు బీ టౌన్ లో మంటలు రాజేస్తున్నాయ్.ఈ క్రమంలో బాలీవుడ్ సెట్స్ లో నటీనటుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎల్లీ వివరిస్తూ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపెట్టింది. అసలు నీకు ఆకలి ఉందా నీరసంగా ఉందా? అన్నది వారికి అవసరం లేదు. భోజనం చేస్తున్నామని చూడకుండా రమ్మని అరుస్తారు అంటూ తన బాధని బయటపెట్టింది. ఒకవేళ నువ్వు స్పృహ తప్పి పడిపోతావని తెలిసినా వాళ్లు కనికరించరు అంటూ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌ల తీరుపై మండి పడింది.తాను ఎంత టాలెంట్ చూపించినా ‘మలంగ్’ సినిమా వరకు తనను ఒక నటిగా ఎవరూ గుర్తించలేదని, కేవలం ఫిగర్ ఎలా ఉందనే దాన్నిబట్టి ఛాన్స్ లు ఇస్తారని ఫైర్ అయింది.
సౌత్ సినిమాల గొప్పతనం చాటిన ఎల్లీ
సౌత్ సినిమాల్ని చేయడం ఎంతో ప్రశాంతత
ఇక అదే క్రమంలో పక్కనే ఉన్న సౌత్ సినిమాల్ని వెనకేసుకొని రావడం విశేషం. “దక్షిణాది సినిమాల్లో పనిచేయడం నాకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. అక్కడ ఎవరూ కేకలు వేయరు, అంతా నిశ్శబ్దంగా, పద్ధతిగా వాకీటాకీల్లో మాట్లాడుకుంటారు” అంటూ సౌత్ వర్కింగ్ స్టైల్ ని ఆకాశానికి ఎత్తింది.ఇక బాలీవుడ్ మేకర్స్ నటీనటుల ప్రతిభను ఎలా తొక్కిపెడతారో కూడా ఎల్లీ వివరించింది. “నువ్వు అందంగా ఉన్నావంటే నిన్ను కేవలం గ్లామర్ బొమ్మగానే చూస్తారు. గ్లామర్ పాత్రలకు తప్ప సీరియస్ రోల్స్‌కు పనికిరావు అని ముద్ర వేసేస్తారు (Typecasting)” అంటూ ఘాటైన కామెంట్స్ చేసింది.దీంతో చాలా మంది బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటం, సౌత్ సినిమాలు నెంబర్ 1 పొజిషన్ కి దూసుకు రావడానికి వెనుకున్న రీజన్ ఇదే అని తమదైన జడ్జ్ మెంట్స్ పాస్ చేస్తున్నారు.
ప్రతిభను తొక్కిపెట్టే బాలీవుడ్ మేకర్స్
ఇక ఈ ఫారిన్ బ్యూటీ నటించిన సినిమాల విషయానికి వస్తే, ‘మిక్కీ వైరస్’, ‘నాపేరు సూర్య’, కోలీవుడ్ స్టార్ ధనుష్ ‘నేనే వస్తున్నా’, ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్’ వంటి సినిమాలల్లో తనదైన డాన్స్ తో మెప్పించగా, తాజాగా 2025లో వచ్చిన ‘బీ హ్యాపీ’ చిత్రంతో మాత్రం నటిగా మంచి మార్కులే కొట్టేసింది.చూడాలి మరి ఈ అమ్మడు చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ బాబులు ఎలా రియాక్ట్ అవుతారో !
మొత్తానికి ఎల్లీ అవ్రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. సౌత్ సినీ పరిశ్రమపై ప్రశంసలు కురిపిస్తూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


