
📌 Key Points
- తమన్నా తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ప్రేమను బహిరంగంగా ప్రకటించి ఆశ్చర్యపరిచింది.
- గతంలో ఒక రిలేషన్‌షిప్‌లో ఉండటం తన వ్యక్తిత్వానికి, కెరీర్‌కు ప్రమాదమని గ్రహించానని తమన్నా తెలిపింది.
- విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం ‘లస్ట్ స్టోరీస్ 2’ సెట్స్‌లో మొదలైందని సమాచారం.
- ప్రస్తుతం తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది, ఓటీటీలో కూడా నటిస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన పాత రిలేషన్‌షిప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒక బంధం ప్రమాదకరమని తెలిసి బయటకు వచ్చానని ఆమె చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
తమన్నా పాత రిలేషన్స్‌పై కామెంట్స్
Tamannaah:మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, బోల్డ్ నిర్ణయాలకు కూడా కేరాఫ్ అడ్రస్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ భామ, తాజాగా తన పాత రిలేషన్‌షిప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక బంధం ‘ప్రమాదకరం’ అని తెలిసి బయటకు వచ్చానంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న తమన్నా, తన వ్యక్తిగత జీవితాన్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. కెరీర్ కోసం ఒక వ్యక్తికి, అలాగే స్వభావం కలవకపోవడం వల్ల మరో వ్యక్తికి బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
కెరీర్‌కు డేంజర్ అంటే ఏమిటి?
ముఖ్యంగా ఒక రిలేషన్‌షిప్‌లో ఉండటం తన వ్యక్తిత్వానికి, కెరీర్‌కు ‘డేంజర్’ అని గ్రహించాకే ఆ బంధం నుండి తప్పుకున్నానని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఆ డేంజర్ పర్సన్ ఎవరై ఉంటారా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
విజయ్ వర్మతో బ్రేకప్ నిజమేనా?
తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ‘లస్ట్ స్టోరీస్ 2’ సెట్స్‌లో మొదలైన వీరి పరిచయం ప్రేమికులుగా మార్చింది. అయితే కాలక్రమమైన వీరి మధ్య స్పర్ధలు రావడంతోనే విడిపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమన్నా తాజా కామెంట్స్ నేపథ్యంలో, కొందరు నెటిజన్లు ఆమె మాజీ ప్రియుడు విజయ్ వర్మ పేరును కూడా ప్రస్తావిస్తున్నారు.. విజయ్ వర్మ విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, వ్యక్తిగతంగా వీరిద్దరి జోడీపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.
ప్రస్తుతం తమన్నా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. గత సంవత్సరం ఓదెల 2 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆమె ఒకవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు ఓటీటీలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్లో పురుషన్ అనే చిత్రంలో నటిస్తోంది.ఇందులో విశాల్ హీరోగా నటిస్తూ ఉండగా.. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో మొగుడు అంటూ డబ్బింగ్ వెర్షన్లలో రిలీజ్ చేయనున్నారు. మరొకవైపు బాలీవుడ్ లో అజయ్ దేవగన్, సంజయ్ దత్ కాంబినేషన్ లో వస్తున్న రేంజర్ అనే సినిమాలో అవకాశం అందుకుంది. లవ్ రంజన్ ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నారు.
తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా అందరి దృష్టి ఉంది. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడి కానున్నాయి.


