|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొత్త కారు కొన్న టాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్.. వైరల్‌గా మారిన ఫోటోలు.. దాని ధర ఎంతో తెలిసా?

Published: 31-05-2025, 10:45 AM
కొత్త కారు కొన్న టాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్.. వైరల్‌గా మారిన ఫోటోలు.. దాని ధర ఎంతో తెలిసా?

టాలీవుడ్ నటి ఆకాంక్ష సింగ్ తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. SVC, XEV 9EV కారును ఆమె ఎంచుకున్నారు.

Key Points

1

టాలీవుడ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ కొత్త కారు కొన్నారు.

2

SVC, XEV 9EV ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు.

4

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆకాంక్ష సింగ్ కొత్త వాహనం

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (Akanksha Singh)గురించి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘డాన్ ఔర్ డాక్టర్’(Dan our doctor) చిత్రంతో సినీ పరిశ్రమకు వచ్చింది. ఇక తెలుగులో ఆకాంక్ష సింగ్ అక్కినేని హీరో సుమంత్ సరసన ‘మళ్లీ రావా’ (Malli Raava)సినిమాలో నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో పాటు ఆకాంక్ష సింగ్ నటన, అభినయం, అందానికి బాగానే మార్కులు పడ్డాయి. దీంతో వెంటనే అక్కినేని నాగార్జున, నాని కాంబోలో వచ్చిన ‘దేవదాస్’ చిత్రంలో అవకాశం అందుకుంది. కానీ విజయం సాధించలేకపోయింది. ఇక తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తున్న ఈ భామ క్రేజీ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

వైరల్ ఫోటోలు

ఇక ఇటీవల ఆకాంక్ష సింగ్ ‘షష్టిపూర్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ ప్రభా (Pawan Prabha)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్(Rupesh Chaudhary), అచ్యుత్ కుమార్, ఆనంద చక్రపాణి, చలాకీ చంటీ, మురళీధర్ గౌడ్, సంజయ్ స్వరూప్ కీలక పాత్రలో నటించగా.. దీనిని హీరోగా నటించిన రూపేష్ చౌదరీ నిర్మించాడు. ఈ మూవీకి స్టార్ ఇళయరాజా మ్యూజిక్ అందించారు. అయితే మే 30న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా అమ్మనాన్న కథతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కారు ధర వివరాలు

ఇదిలా ఉంటే.. తాజాగా, ఆకాంక్ష సింగ్ తన సినిమా ‘షష్టిపూర్తి’ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది. ఆమె ఇటీవల ఓ కారును కొనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలు బాలా ఇష్టపడే ఈ ఎలక్ట్రిక్ SVC, XEV 9EV కారును కొనుగోలు చేయగా.. దీని రేటు 21. 90 లక్షల నుంచి 30.50 లక్షల వరకు ఉంటుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఆకాంక్ష సింగ్ కొత్త కారు కొనుగోలుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘షష్టిపూర్తి’ సినిమా సక్సెస్‌తో ఈ సంతోషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.