|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’: డబ్బింగ్ పూర్తి! ఓటీటీలో రికార్డు ధర!

Published: 07-03-2026, 3:35 AM
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్': డబ్బింగ్ పూర్తి! ఓటీటీలో రికార్డు ధర!
  • 14 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా.
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది.
  • పవన్ కళ్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు.
  • సినిమా ఓటీటీ హక్కులు 80 కోట్లకు అమ్ముడయ్యాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మొదలుపెట్టారు. సినిమా విడుదలకి ముందే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి.

పవన్ కళ్యాణ్ డబ్బింగ్ షురూ!

UBS Pawan Kalyan: దాదాపు 14 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కాంబోలో మళ్లీ సినిమా రాబోతుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీ లీల (Sree Leela) రాశిఖన్నా (Raashii khanna) హీరోయిన్లుగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ , చేకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం మొదట మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. విడుదల తేదీని ప్రీ పోన్డ్ చేస్తూ మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇకపోతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఒకవైపు అంచనాలు పెరుగుతుంటే మరొకవైపు అంత బిజీ షెడ్యూల్లో కూడా తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. నేటి నుంచి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇకపోతే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్ తన సినిమా కి డేట్స్ కేటాయిస్తూ అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అటు థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డు ధర!

ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో వేగంగా పాల్గొంటున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ నేపథ్యంలోనే ఓటీటీ డీల్ గురించి కామెంట్లు చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓటీటీ డీల్ కుదిరినట్లు ఆయన తెలిపారు.. హరీష్ శంకర్ మాట్లాడుతూ..” నా వ్యక్తిగత పరిశీలన కోసం కొన్ని కీలకమైన సన్నివేశాలను ఎడిట్ చేసి ఒక చిన్న వీడియో సిద్ధం చేసుకున్నాను.. ఆ విజువల్స్ చూసిన నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్లిప్స్ లోని కంటెంట్ , మేకింగ్ స్టైల్ నచ్చడంతో 20 నిమిషాల్లోనే డీల్ కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు” అంటూ హరీష్ శంకర్ తెలిపారు ఇకపోతే 80 కోట్లకు ఈ సినిమా ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. మరొకవైపు ఈ సినిమా బుకింగ్స్ కూడా ఓవర్సీస్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

మార్చి 19న విడుదల కానున్న సినిమా

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.