|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రజనీకాంత్ సినిమాలో చిరు విలన్ అవ్వడానికి కారణం ఆ హీరోయినేనా?

Published: 13-04-2026, 9:35 AM
షాకింగ్: రజనీకాంత్ సినిమాలో చిరు విలన్ అవ్వడానికి కారణం ఆ హీరోయినేనా?
  • 1981లో రజనీకాంత్‌తో చిరంజీవి విలన్‌గా నటించిన ‘రణవీరన్’ చిత్రం.
  • ఎంజీఆర్ కోసం సిద్ధం చేసిన కథ రజనీకాంత్‌తో తెరకెక్కించిన వీరప్పన్.
  • 1982లో ‘బందిపోటు సింహం’గా తెలుగులో డబ్ చేసినా ఆదరణ కరువైంది.
  • చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రాన్ని రజనీకాంత్ రీమేక్ చేశారు.

1981లో చిరంజీవి రజనీకాంత్‌తో కలిసి ‘రణవీరన్’ సినిమాలో విలన్‌గా నటించారు. ఎంజీఆర్ కోసం రాసిన కథ రజనీకాంత్‌తో తెరకెక్కించబడింది. ఆ సినిమా తెలుగులో ‘బందిపోటు సింహం’గా విడుదలై ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

రజనీకాంత్ సినిమాలో చిరంజీవి విలన్ పాత్ర

Chiranjeevi Rajinikanth: అది 1981వ సంవత్సరం. అప్పటికే న్యాయం కావాలి, మొగుడు కావాలి, పున్నమినాగు, కోతలరాయుడు, నకిలీ మనిషి, లవ్ ఇన్ సింగపూర్ వంటి దాదాపు 30 సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా డిఫరెంట్ రోల్స్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు చిరు. అలా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న చిరు 1981వ సంవత్సరంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘రణవీరన్’ సినిమాలో విలన్‌గా కనిపించాడన్న సంగతి మీకు తెలుసా? అవును, ఒకవైపు కెరీర్‌లో దూసుకుపోతున్న చిరు రజనీపై ఉన్న గౌరవంతోనే ‘రణవీరన్’ అనే సినిమాలో విలన్‌గా చేశాడట.

అయితే రజనీకాంత్‌లోని కమర్షియల్ యాంగిల్‌ని గుర్తించిన దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ‘రణవీరన్’ సినిమా వెనకాల కూడా ఆసక్తికరమైన విషయం ఉందండోయ్. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన వీరప్పన్, నిజానికి ఈ కథను ఎంజీఆర్ (MGR) కోసం సిద్ధం చేశారట. కానీ MGR పాలిటిక్స్‌లో ఫుల్ బిజీ అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అప్పటికే తనదైన స్టైలిష్ యాక్టింగ్‌తో నిలబడిపోయిన రజనీని తన సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడట వీరప్పన్. అలా మొత్తానికి ఎంజీఆర్ చేయాల్సిన సినిమాని పట్టేశాడు రజనీ. ఇక రజనీకి జోడీగా శ్రీదేవి హీరోయిన్‌గా, చిరంజీవి విలన్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1981 అక్టోబర్ 26న రిలీజ్ అయి తమిళనాట సాలిడ్ సక్సెస్‌ని చూడటం విశేషం. ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్ మధ్య వచ్చే ఫైట్స్ అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు అప్పట్లోనే ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేశాయ్.

ఎంజీఆర్ నుండి రజనీకాంత్ వరకు సినిమా ప్రయాణం

అయితే అదే సినిమాని 1982లో ‘బందిపోటు సింహం’ అంటూ డబ్బింగ్ చేసి తెలుగులో వదిలినప్పటికీ ఆడియన్స్ అంతగా ఆదరించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ సినిమాతో మొదలైన చిరంజీవి, రజనీకాంత్ మధ్య ఏర్పడిన స్నేహం మాత్రం అలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇక 1989లో చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రాన్ని రజనీకాంత్ తమిళంలో ‘మాపిళ్ళై’గా రీమేక్ చేయగా చిరంజీవి అందులో గెస్ట్ రోల్‌లో నటించాడంటే చిరు స్నేహానికి ఎంత విలువని ఇస్తాడో అర్థమవుతుంది.

తెలుగులో ఆదరణ లేని ‘బందిపోటు సింహం’

అయితే వాస్తవానికి చిరంజీవికి కెరీర్ మొదట్లోనే తమిళ్‌లో హీరోగా మంచి బ్రేక్ రావాల్సి ఉంది. కానీ దురదృష్టం వెంటాడటంతో వచ్చిన అవకాశం కాస్తా చేజారిపోయిన పరిస్థితి. విషయంలోకి వెళ్తే అప్పట్లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి టాప్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన సీనియర్ నటి కె.ఆర్.విజయతో కలిసి చిరంజీవి హీరోగా ఒక తమిళ సినిమా మొదలైందట. ఒక రకంగా అప్పటికే సీనియర్‌గా ప్రూవ్ చేసుకున్న కె.ఆర్.విజయతో సినిమా అంటే అది లక్ అనే చెప్పాలి. ఇక అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరు ఇక తమిళనాట కూడా తనదైన మార్క్ చూపిస్తాడనుకున్నారంతా. కానీ సినిమా కొన్ని రోజులు షూటింగ్ చేసుకున్న తర్వాత అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఒకవేళ గనుక చిరు ఆ సినిమా చేసి ఉండి ఉంటే చిరంజీవి తమిళంలో కూడా అప్పుడే స్టార్ హీరోగా నిలబడిపోయేవాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కె.ఆర్.విజయ. మొత్తానికి కోలీవుడ్‌ని కూడా షేక్ చేయాల్సిన మన మెగాస్టార్ చిరు అలా రజనీ సినిమాతో విలన్‌గా సరిపెట్టుకున్నాడన్న మాట.

చిరంజీవి, రజనీకాంత్ మధ్య స్నేహం ఎప్పటికీ నిలిచిపోయింది. ఒకప్పటి సినిమా అవకాశాలు చేజారినా, వారి బంధం మాత్రం కొనసాగింది. ఇది వారి అనుబంధానికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.