
ప్రముఖ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఢిల్లీలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో కలిసి బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని చాటారు. ఈ వేడుకల ఫోటోలు, ఆమె ఆసక్తికర ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Key Points
ఉపాసన కొణిదెల ఢిల్లీలో సీఎం రేఖా గుప్తాతో కలిసి బతుకమ్మ ఆడారు.
తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రాంజాస్ కాలేజీలో బతుకమ్మ వేడుకలు జరిగాయి.
తెలంగాణ సంస్కృతిని ఆహ్వానించినందుకు ఢిల్లీ సీఎంకు ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు.
బతుకమ్మ వేడుకల ఫోటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు: ఉపాసన సందడి
ప్రముఖ నటుడు రామ్‌చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన కొణిదెల (Upasana Konidela) బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతి చాటారు. తెలంగాణ పండుగను దేశ రాజధానిలో సీఎం రేఖా గుప్తా (Rekha Gupta), తెలుగు విద్యార్థులతో కలిసి ఉపాసన (Bathukamma) బతుకమ్మ ఆడారు. ఢిల్లీలోని తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (Telugu Students Association Delhi), తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో (Ramjas College) రాంజాస్ కలశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు ముఖ్యఅతిథులుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉపాసన కొణిదెల హాజరై సందడి చేశారు. ఢిల్లీ సీఎం, స్టూడెంట్స్‌తో కలిసి ఉపాసన బతుకమ్మ ఆడిపాడారు. ఈ మేరకు ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.
సీఎం రేఖా గుప్తాతో కలిసి బతుకమ్మ
ఈ సందర్భంగా రాంజాస్ కాలేజ్ విద్యార్థులకు, సీఎం రెఖా గుప్తాకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పండుగ కాలంలో మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ‘దేవి’ని సత్కరించుకొని, మన బలాన్ని కలిసి జరుపుకుందాం.. అని పేర్కొన్నారు. రేఖా గుప్తా జీ, మీరు ఒక అద్భుతమైన సీఎం.. తెలంగాణ సంస్కృతిని ఆప్యాయంగా ఆహ్వానించి, బతుకమ్మ పండుగను మాతో కలిసి జరుపుకున్నందుకు ధన్యవాదాలు.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వైరల్‌గా మారిన ఉపాసన ట్వీట్, ఫోటోలు
ట్వీట్ కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం ద్వారా ఉపాసన కొణిదెల తెలంగాణ సంస్కృతిని దేశ రాజధానికి తీసుకువెళ్లారు. సీఎం రేఖా గుప్తాతో కలిసి ఆమె ఆడిన బతుకమ్మ చిత్రాలు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


