|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ వచ్చేసింది! ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

Published: 04-02-2026, 7:05 AM
పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే! 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీ వచ్చేసింది! ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
  • పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.
  • దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
  • నాని సినిమా వాయిదా పడటంతో పవన్ సినిమా విడుదల కానుంది.
  • పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh ) . డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా 2026 ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల కాబోతుందని గతంలో నిర్మాతలు ప్రకటించారు కానీ మార్చి నెలలో విడుదల కావాల్సిన కొన్ని పాన్ ఇండియా సినిమాలు పక్కకు తప్పుకోవడంతో అదే స్థానంలోకి పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ చకర్లు కొట్టాయి. ఇలా ఈ సినిమా విడుదల విషయంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర నిర్మాతలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేశారు. అందరూ అనుకున్న విధంగానే ఈ సినిమా మార్చ్ 26వ తేదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాతలు అధికారకంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మార్చి 26వ తేదీ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమా విడుదల కాబోతుందని చిత్ర బృందం తెలిపారు కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమా తప్పుకుంది. అలాగే మార్చి 27వ తేదీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదల కాబోతుందని చిత్రం నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమా కూడా విడుదల వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇలా ఈ సినిమా మార్చిలోనే విడుదలకు కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియచేయడంతో అభిమానులు అబ్బాయ్ తప్పుకుంటే బాబాయ్ వస్తున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల

Get ready to cheer, whistle, and stomp your feet to celebrate our USTAAD 🕺🤟🏻🙇🏻💥💥

This summer, the box office will be on FIRE with the duo of POWER STAR & CULT CAPTAIN 🔥 #UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026. #UBSOnMarch26th

POWER STAR @PawanKalyan … pic.twitter.com/zUJupQR0So

పవన్ అభిమానులకు గుడ్ న్యూస్!

— Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2026

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడిగా శ్రీ లీల (Sreeleela)నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మరో నటి రాశి కన్నా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు . పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కూడా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న నేపథ్యంలో అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇటీవల తన సినిమాలను చాలా వరకు తగ్గించి రాజకీయాలపై ఫోకస్ చేశారు . డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన సినిమాలు ఒక్కొక్కటి విడుదల అవుతున్నాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒజీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి .ఇక ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మార్చి 26న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.