|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజమౌళి ‘వారణాసి’ టీజర్ తేదీ ఫిక్స్: చరిత్రలో నిలిచిపోయే ఘట్టానికి రంగం సిద్ధం!

Published: 05-01-2026, 12:30 AM
రాజమౌళి 'వారణాసి' టీజర్ తేదీ ఫిక్స్: చరిత్రలో నిలిచిపోయే ఘట్టానికి రంగం సిద్ధం!
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘వారణాసి’ చిత్రం తెరకెక్కుతోంది.
  • ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
  • జనవరి 5న ప్యారిస్‌లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్‌లో టీజర్ విడుదల.
  • యూరప్‌లోని అతిపెద్ద థియేటర్‌లో ప్రదర్శిస్తున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలవనుంది.

రాజమౌళి-మహేష్ బాబుల ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ టీజర్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి 5న ప్యారిస్‌లోని లే గ్రాండ్ రెక్స్ థియేటర్‌లో ఈ టీజర్‌ను అత్యంత ఘనంగా ప్రదర్శించనున్నారు. యూరప్‌లో ఇంత పెద్ద థియేటర్‌లో ప్రదర్శిస్తున్న తొలి భారతీయ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది.

రాజమౌళి-మహేష్ వారణాసి: భారీ అంచనాలు!

Varanasi: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి(Rajamouli ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు(Maheshbabu ) తొలిసారి ఈ సినిమాతో పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకొని గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఈ సినిమాలో హీరోయిన్గా మందాకిని అనే ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రముఖ మలయాళ సినీ నటుడు, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithvi Raj sukumaran) ఈ సినిమాలో కుంభ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సెలబ్రిటీలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు వారి పాత్రలను కూడా రివీల్ చేశారు.

ఇదిలా ఉండగా అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూడగా.. గత ఏడాది గ్లోబ్ ట్రోటర్ అంటూ రామోజీ ఫిలిం సిటీ వేదికగా లక్ష మంది అభిమానుల మధ్య చాలా ఘనంగా ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ టైటిల్ విడుదల చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ మూవీ కథ నేపథ్యాన్ని తెలుపుతూ ఉన్న ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.అయితే ఇప్పుడు చరిత్రను తిరగరాయడానికి ఈ సినిమా నుండి రాబోతున్న మరో అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది.

టీజర్ విడుదల ముహూర్తం, వేదిక ఖరారు

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేశారని సమాచారం. అంతేకాదు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్యారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ లో జనవరి 5 రాత్రి 9 గంటలకు చాలా గ్రాండ్గా ఈ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. 2,702 సీట్లు కలిగిన ఈ థియేటర్ యూరప్ లోనే అతిపెద్ద థియేటర్ గా రికార్డు సృష్టించింది. అలాంటి ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్ బాబు చిత్రం వారణాసి నిలవనుంది. ఈ విషయాన్ని అభిమానులతో తెలియజేస్తూ భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్నా ఫిలిమ్స్ ఈ వార్తను అధికారికంగా ధ్రువీకరించింది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్ పై గొప్ప ఫార్మాట్లో ఈ టీజర్ ను ప్రదర్శించనున్నారు.

2027 సమ్మర్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించడానికి రాజమౌళి చేస్తున్న ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పుడు హడావిడిగా ప్రమోషన్స్ చేపట్టడం కంటే ఇలా ముందు నుంచే అభిమానులలో అంచనాలు పెంచేసి సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న రాజమౌళి పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టించనున్న వారణాసి

వారణాసి చిత్ర టీజర్ ప్రపంచ స్థాయి ప్రమోషన్లకు నాంది పలికింది. రాజమౌళి దూరదృష్టితో కూడిన ఈ ప్రయత్నం సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.