|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎస్పీబీని అలా పిలవండి: వెంకయ్య నాయుడు గూస్ బంప్స్ స్పీచ్, బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ!

Published: 15-12-2025, 10:08 AM
ఎస్పీబీని అలా పిలవండి: వెంకయ్య నాయుడు గూస్ బంప్స్ స్పీచ్, బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ!
  • వెంకయ్య నాయుడు రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
  • బాలసుబ్రహ్మణ్యంను పూర్తి పేరుతో పిలవాలని వెంకయ్య నాయుడు కోరారు.
  • బాలసుబ్రహ్మణ్యం గొంతు అక్షయపాత్ర అని, 50 ఏళ్లు ప్రజలను అలరించారని ప్రశంసించారు.
  • నవతరానికి ఎస్పీబీ గొప్పదనం తెలిసేలా విగ్రహం ఏర్పాటు చేశామని వెల్లడించారు.

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు గూస్ బంప్స్ తెప్పించే ప్రసంగం చేశారు. స్వర సార్వభౌముడు ఎస్పీబీని పూర్తి పేరుతో పిలవాలని కోరారు. ఆయన సంగీత ప్రస్థానాన్ని, గొప్పదనాన్ని కొనియాడారు.

ఎస్పీబీ విగ్రహావిష్కరణ: వెంకయ్య నాయుడు మాటలు

Venkaiah Naidu : రవీంద్ర భారతి లో ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి వెంకయ్య నాయుడు గూస్ బంప్స్ తెప్పించే స్పీచ్ ఇచ్చారు.

బాలసుబ్రమణ్యం గారు స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం జలపాతం. ఓ పాపా లాలీ వంటి పాటలోని అమాయకపు అల్లరి. పనులు కనులు కలిసాయి వంటి పాటల్లో ఒక శృంగారపు మాధుర్యం. ఆయన పాడుతుంటే మనల్ని ఆయా పాత్రలోకి తీసుకెళ్లి పోయేవారు. సినిమా చూస్తున్నప్పుడు ఆ నటుడే పాడుతున్నాడు అనిపించేలా ఉండేవి ఆయన పాటలు. ఆయన గలం సంగీత దర్శకుడు ఏది కోరుకుంటే అది ఇచ్చే ఒక అక్షయపాత్ర.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను పూర్తి పేరుతో పిలవండి. పరిపూర్ణ కళాకారుడు బాలసుబ్రహ్మణ్యం. నటుడిగా ,సంగీత దర్శకుడిగా వాక్యతగా నిలిచిన మహనీయుడు. రవీంద్ర భారతి లో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఆనందం. తెలుగు సినిమా రంగంలో బాల సుబ్రహ్మణ్యం గురించి చెప్పలేనిది. రోజు నేను ఉదయాన్నే లేచాక బాల సుబ్రహ్మణ్యం ,ఘంటసాల పాటలు విని ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాను. నవ తరానికి, యువ తరానికి ,రేపటి తరానికి ఈ మహానుభావుడు గురించి తెలిసేలా ఏర్పాటు చేశాం. విగ్రహానికి రూపం పోసిన శిల్పి కి ధన్యవాదాలు. అంటూ వెంకయ్య నాయుడు స్పీచ్ ఇచ్చారు.

స్వర సార్వభౌముడికి ఘన నివాళి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం సంతోషం. ఘంటసాల తర్వాత బాల సుబ్రహ్మణ్యం జీవితంలో సుమారుగా 50 సంవత్సరాల పాటు ఆయన గొంతు తెలుగు ప్రజలకు భారతీయ సంస్కృతి ను ఆధ్యాత్మిక భావాలని పాట రూపంలో స్పష్టంగా చెప్పేవాడు. శంకరాభరణం సినిమాలో ఉన్న శివుని పాట నాకు ఇష్టం. అజాత శత్రువు బాల సుబ్రహ్మణ్యం. ప్రేమ చూపించే వ్యక్తి బాల సుబ్రహ్మణ్యం. బాల సుబ్రహ్మణ్యం కుమారుడు కూడా భవిష్యత్ లో చిన్న బాల సుబ్రహ్మణ్యం కావాలి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చెప్పుకోదగ్గ విషయం. తెలుగు లో 14 భాషలలో పాటలు పాడి పాటల పల్లకిలో ఉంటూ మన గుండెల్లో నిలిచాడు.ఒక నటుడిగా ,సంగీత దర్శకుడిగా పరిచయం.40 వేల పై చిలుకు పాటలు పాడాడు. బాల సుబ్రహ్మణ్యం అభిమానులు చాలా మంది మహనీయుడు విగ్రహం పెట్టాలన్నారు. ప్రపంచ స్థాయిలో నిలిచే వ్యక్తి బాల సుబ్రహ్మణ్యం.

బాలసుబ్రహ్మణ్యం గురించి వెంకయ్య నాయుడు స్పీచ్ ముఖ్యాంశాలు

రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సహించిన ప్రదేశం. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి , జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉండే కొన్ని కారణాల వల్ల రాలేదు. కోట్లాది మంది హృదయ స్పందన ఇది. సినిమాలో తెర వెనుక పాడే వారు ఎవరని తెలియదు. మహనీయుడు బాల సుబ్రహ్మణ్యం, పాటలతోనే సినిమా హిట్ అవుతుంటాయి. పది సంవత్సరాల కింద నేను మంత్రిగా ఉన్నపుడు బాల సుబ్రహ్మణ్యం నీ కలిశాను. రాష్ట ప్రభుత్వం తరుపున ఇంత చక్కటి కార్యక్రమం లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అజాత శత్రువు అని, ప్రేమ పంచిన వ్యక్తి అని వెంకయ్య నాయుడు కీర్తించారు. తరతరాలు గుర్తుంచుకునేలా ఏర్పాటు చేసిన విగ్రహం ఎస్పీబీ గొప్పదనానికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.