
📌 Key Points
- 16 ఏళ్ల వయసులో వితికా శేరుకు ఎదురైన కమిట్మెంట్ ఆఫర్.
- తల్లి ముందే కమిట్మెంట్ గురించి అడిగిన వ్యక్తి.
- కమిట్మెంట్లకు నిరాకరించిన వితికా, ఆమె తల్లి.
- యూట్యూబ్ వీడియోలతో వితికా శేరు సంచలనం.
సినీ నటి వితికా షేరు తన 16 ఏళ్ల వయసులో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది. తన తల్లి ముందే ఒక వ్యక్తి కమిట్మెంట్ అడగడం పట్ల ఆమె టాలీవుడ్ పై అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉన్నారు.
వితికా షేరు కెరీర్ తొలినాళ్లలో అనుభవం
Vithika sheru: సాధారణంగా కమిట్మెంట్ అనే పదం మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.. అయితే సినిమా రంగం పబ్లిక్ కాబట్టి ఈ రంగంలో ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది తమ కెరియర్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నారు.. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి , బిగ్ బాస్ బ్యూటీ వితికా షేరు కూడా గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను.. ముఖ్యంగా పదహారేళ్ళ వయసులోనే తనను తన తల్లి ముందే కమిట్మెంట్ అడిగిన విషయాన్ని.. టాలీవుడ్ ఇండస్ట్రీ వ్యవహరిస్తున్న తీరు గురించి మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు సినిమాలు, షోలు అంటూ బిజీగా మారిన ఈమె ఇప్పుడు యూట్యూబ్ వీడియోలతో సంచలనం సృష్టిస్తోంది.. ఇక కాస్త సమయం దొరికితే చాలు అభిమానులతో ముచ్చటించే ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అలాగే తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కమిట్మెంట్ గురించి మాట్లాడుతూ.. “దాదాపు 14 ఏళ్ల క్రితం.. అంటే నాకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో జరిగిన ఒక ఆడిషన్ కి మా అమ్మతో కలిసి వెళ్లాను. అయితే ఆడిషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పాత్రకు నన్ను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో నన్ను బయటకు పంపి నా తల్లితో కమిట్మెంట్ గురించి మాట్లాడారు.
కమిట్మెంట్ గురించి అడిగిన వ్యక్తితో సమాధానం
ఇక ఆ మాట విన్న వెంటనే మా అమ్మ నన్ను లోపలికి పిలిచింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో బ్రతకాలి.. నెగ్గుకు రావాలి అంటే చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి అవగాహన ఉండాలి అని అప్పుడే అమ్మ కళ్ళకు కట్టినట్టు చూపించింది. అయితే కమిట్మెంట్ అనే పదానికి అర్థం నాకు తెలుసు. దాని పరిణామాలు కూడా అర్థమయ్యాయి అని నేను మా అమ్మతో వివరించాను. నిజానికి నాకు మా అమ్మకు మధ్య ఎటువంటి రహస్యాలు ఉండేవి కాదు. అందుకే మా అమ్మ వెంటనే స్పందించింది.అయితే కమిట్మెంట్ గురించి అడిగిన వ్యక్తితో మేము అలాంటి వాటికి ఆసక్తి చూపించము..సినిమా కథ నచ్చినా.. రెమ్యూనరేషన్ లేకపోయినా సినిమా చేస్తాం కానీ ఇలాంటి కమిట్మెంట్లు అంగీకరించమని స్పష్టం చేశాము.
యూట్యూబ్ వీడియోలతో బిజీగా వితికా
అయితే ఆ తరువాత రోజు ఈ సినిమా గురించి చెప్పిన ఆ వ్యక్తికి నేను ఈ విషయం చెబితే ..ఆయన దర్శకుడికి ఫోన్ చేసి మాట్లాడాక..ఇలాంటి విషయాలు బయటకు ఎందుకు చెప్పావని నాపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పాను. అది వింటేనే అంత కోపం వస్తే అక్కడ అనుభవించిన నాకెంత కోపం రావాలి అంటూ ఆమె ప్రశ్నించారు. ఇక ఈ కమిట్మెంట్ అనుభవం తర్వాత తను చాలా అవకాశాలు వదులుకున్నానని చెప్పుకొచ్చారు వితికా శేరు. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో ప్రయత్నించానని , అయితే ఇలాంటి అనుభవాలు అక్కడ పెద్దగా ఎదురు కాలేదని.. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది.
మొత్తానికి వితికా షేరు తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను ధైర్యంగా బయటపెట్టింది. ఆమె టాలీవుడ్ లోని పరిస్థితుల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె యూట్యూబ్ వీడియోలతో ముందుకు సాగుతున్నారు.

