|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాక్సిక్ టీజర్ సంచలనం: యష్ సరసన నటించిన నటాలీ బర్న్ ఎవరు? ఆమె నేపథ్యం తెలుసుకోండి!

Published: 09-01-2026, 5:30 AM
టాక్సిక్ టీజర్ సంచలనం: యష్ సరసన నటించిన నటాలీ బర్న్ ఎవరు? ఆమె నేపథ్యం తెలుసుకోండి!
  • యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో నటాలీ బర్న్ ఒక నటి.
  • నటాలీ ఉక్రేనియన్-అమెరికన్ నటి, హాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది.
  • ది ఎక్స్‌పెండబుల్స్ 3 వంటి చిత్రాల్లో నటించారు.
  • టాక్సిక్ సినిమాకు నటించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

కేజిఎఫ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీతో వస్తున్నారు. ఇందులో నటించిన నటాలీ బర్న్ టీజర్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నటాలీ బర్న్ ఎవరు?

Yash Toxic: కేజిఎఫ్ సినిమాతో సంచలనాలను సృష్టించిన నటుడు యష్ (Yash)త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈయన ప్రస్తుతం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో టాక్సిక్(Toxic) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ఒక టీజర్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నటుడు యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ టీజర్ వీడియోలో కొన్ని బోల్డ్ సీన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ సినిమా చేసింది ఒక లేడీ డైరెక్టరేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్ లో గమనిస్తే కారులో బోల్డ్ సీన్ లో కనిపించిన నటి క్షణాలలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. దీంతో ఈమె ఎవరు? తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చలు మొదలుపెట్టారు. మరి టీజర్ లో కనిపించిన ఆ నటి ఎవరు ?తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే..

హాలీవుడ్ లో నటాలీ కెరీర్

యష్ టాక్సిక్ టీజర్ లో కనిపించిన ఈమె పేరు నటాలీ బర్న్(Natalie Burn) . ఈమె ఉక్రేనియన్-అమెరికన్ నటి. నటాలీ గత రెండు దశాబ్దాల నుంచి హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్‌లోని కైవ్‌లో జన్మించిన నటాలి నటనపై ఆసక్తితో అమెరికా వెళ్లి అక్కడ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఈమె పలు హాలీవుడ్ యాక్షన్ సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ది ఎక్స్‌పెండబుల్స్ 3 , జాసన్ స్టాథమ్‌తో మెకానిక్: రిసరెక్షన్ , టిల్ డెత్ డు అస్ పార్ట్ వంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలతో పాటు ది కమ్‌బ్యాక్ ట్రైల్, ఐస్ ఇన్ ది ట్రీస్ వంటి థ్రిల్లర్ చిత్రాలలో కూడా నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

టాక్సిక్ సినిమాకు సహనిర్మాత..

టాక్సిక్ సినిమాలో నటాలీ పాత్ర

ఇలా హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటాలీ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈమె నటించడమే కాకుండా ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నారు. వెండితెరపై మాత్రమే కాకుండా తెర వెనుక కూడా ఈమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సక్సెస్ అయిన నటాలీ టాక్సిక్ సినిమా ద్వారా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమా ద్వారా ద్వారా ఈమె ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.

నటాలీ బర్న్ హాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు యష్ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. ఈ సినిమాతో ఆమెకు మరింత పేరు వస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.