|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విరోష్ పెళ్లి రిసెప్షన్: అల్లు అర్జున్ నుండి ఊహించని బహుమతి! ఇంతకీ ఏమివ్వబోతున్నారో?

Published: 03-03-2026, 8:35 AM
విరోష్ పెళ్లి రిసెప్షన్: అల్లు అర్జున్ నుండి ఊహించని బహుమతి! ఇంతకీ ఏమివ్వబోతున్నారో?
  • విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది.
  • హైదరాబాద్‌లో ఫిబ్రవరి 4న విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.
  • అల్లు అర్జున్ ఈ జంటకు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు వార్తలు.
  • రిసెప్షన్‌కు ఆహ్వానం ఉన్నవారికే అనుమతి, క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ విధానం.

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా వారికి ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వనున్నట్లు సమాచారం.

విజయ్, రష్మికల వివాహ వేడుక

Allu Arjun -Virosh: టాలీవుడ్ క్రేజీ హీరో హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ పెళ్లి తర్వాత హైదరాబాద్ చేరుకొని పలు ఆలయాలను సందర్శిస్తూ పూజ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇక ఈ దంపతులు ఫిబ్రవరి 4వ తేదీ హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ రిసెప్షన్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు విరోష్ జంట నిబంధనలు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరికీ సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీరిద్దరికి ప్రత్యేకమైన కానుకను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

విరోష్ రిసెప్షన్‌కు అల్లు అర్జున్ గిఫ్ట్

విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ లో భాగంగా అల్లు అర్జున్ ఈ కొత్త జంటకు ఖరీదైన కారును కానుకగా ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ కానుక ఇవ్వబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక అల్లు అర్జున్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించిన సందడి చేశారు.

వెడ్డింగ్ రిసెప్షన్ కు నిబంధనలు..

రిసెప్షన్ కోసం ప్రత్యేక నిబంధనలు

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ రష్మిక పెళ్లికి ఖరీదైన కానుకను ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ కొత్త జంట అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇక ఈ రిసెప్షన్ వేడుకలో రాజకీయ నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు కూడా హాజరవుతారని ఊహించిన ఈ జంట కొన్ని నిబంధనలను పెట్టారు. కేవలం ఆహ్వానం అందిన వారు మాత్రమే ఈ కార్యక్రమానికి రావాలని వన్ టైం క్యూ ఆర్ కోడ్ స్కాన్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం వీరిద్దరూ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మొత్తానికి అల్లు అర్జున్ విరోష్ జంటకు ఏమి బహుమతిగా ఇస్తారో చూడాలి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.