
📌 Key Points
- అల్లు శిరీష్, నైనికల వివాహం మార్చి 6న జరగనుంది.
- దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ తర్వాత అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది.
- పసుపు దంచే వేడుకలో మెగా కుటుంబ సభ్యుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ఉపాసన డెలివరీ తర్వాత మొదటిసారి ఈ వేడుకలో కనిపించారు.
అల్లు శిరీష్ వివాహం మార్చి 6న జరగనున్న నేపథ్యంలో అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. తాజాగా జరిగిన పసుపు దంచే వేడుకలో మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అంగరంగ వైభవంగా అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు
Allu Sirish: అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అల్లు అరవింద్(Allu Aravind) చిన్న కుమారుడు అల్లు శిరీష్(Allu Sirish) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అల్లు శిరీష్ నైనికల వివాహం మార్చి 6వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇలా వీరి పెళ్లి తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెళ్లి వేడుకలు కూడా మొదలయ్యాయి ఇదివరకే అల్లు శిరీష్ నైనిక తన స్నేహితులకు దుబాయిలో ఘనంగా బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ అనంతరం సాంప్రదాయబద్ధంగా అల్లు శిరీష్ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. తన పెళ్లికి సంబంధించిన వరుస అప్డేట్స్ శిరీష్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
తాజాగా తన ఇంట్లో పసుపు దంచే వేడుక జరిగిందని తెలుస్తోంది.. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో పెళ్లి పనులు చాలా సాంప్రదాయ బద్ధంగా ప్రారంభించారని స్పష్టమవుతుంది.. ఇక ఈ పసుపు దంచుడు కార్యక్రమంలో భాగంగా అల్లు మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఈ వేడుకను ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతోపాటు తన కుమార్తె సుస్మిత కోడలు ఉపాసన, పవన్ కళ్యాణ్ భార్య అన్నా వంటి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
పసుపు దంచే వేడుకలో మెగా కుటుంబ సందడి
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా పసుపు దంచుతూ ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఉపాసన జనవరి 31వ తేదీ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా డెలివరీ తరువాత మొదటిసారి ఉపాసన ఈ వేడుకలో కనిపించడం గమనార్హం. మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అల్లు శిరీష్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక అల్లు శిరీష్ మార్చి 6వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నప్పటికీ వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు త్వరలోనే ఈ విషయాలన్నింటినీ కూడా అధికారకంగా తెలియజేయబోతున్నారు. ఇక శిరీష్ సైతం ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన నైనిక రెడ్డి అనే అమ్మాయితో గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న శిరీష్ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేస్తూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం.
స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉపాసన
మొత్తానికి అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మెగా కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరడంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా నిలిచింది. శిరీష్, నైనికల వివాహానికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


