|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి సాహసం: ఫ్లాప్ హీరోయిన్‌తో సంక్రాంతి సంచలనం! వెంకీ, కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారా?

Published: 26-03-2026, 12:35 PM
అనిల్ రావిపూడి సాహసం: ఫ్లాప్ హీరోయిన్‌తో సంక్రాంతి సంచలనం! వెంకీ, కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారా?
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి.
  • వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా చేయనున్నారు.
  • ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
  • కృతి శెట్టి వరుస ఫ్లాప్ లతో ఉండటంతో ఆమెను ఎంపిక చేయడంపై నెటిజన్ల ఆశ్చర్యం.

అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో కలిసి పనిచేయనున్నారు. అయితే, కీర్తి సురేష్ తో పాటు వరుస ఫ్లాప్ లతో ఉన్న కృతి శెట్టిని కూడా ఎంపిక చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అనిల్ రావిపూడి తదుపరి చిత్రం

Anil Ravipudi: అనిల్ రావిపూడి హిట్ మిషన్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ ఎడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి తదుపరి సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక అనిల్ రావిపూడి తన పదవ సినిమాని విక్టరీ వెంకటేష్ కళ్యాణ్ రామ్ లతో చేయబోతున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఈ ఏడాది జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి నిత్యం ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈమె సీనియర్ నటుడు వెంకటేష్ కు జోడిగా నటించబోతున్నారని తెలుస్తోంది. అలాగే మరొక హీరోగా నటిస్తున్న నటుడు కళ్యాణ్ రామ్(కళ్యాణ్ Ram) జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లు తెరపై వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.

హీరోయిన్లుగా కీర్తి, కృతి శెట్టి?

ఇలా ఈ సినిమాలో కీర్తి సురేష్ కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపికయ్యారనే వార్తలు వైరల్ గా మారడంతో పలువురు ఈ వార్తలు పై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు ఈమె వరసగా తెలుగు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న కృతి శెట్టిను ఈ సినిమాలో ఎంపిక చేయడం పట్ల నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. హిట్ మిషన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి తన సినిమాలో ఇలా హీరోయిన్ ఎంపిక చేయడం వెనుక కారణం ఏంటీ అనే విషయాలపై చర్చలు జరుపుతున్నారు.

ఫ్లాప్ నుంచి కృతి శెట్టి బయటపడేనా?

కృతి శెట్టి ఎంపికపై నెటిజన్ల స్పందన

ఇలా ఈ సినిమాలో కృతి శెట్టిని తీసుకోవడంతో మరి కొంతమంది స్పందిస్తూ ఫ్లాప్ హీరోయిన్ తో అనిల్ రావిపూడి సాహసం చేస్తున్నారా? అంటూ కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈమె తెలుగులో ఇటీవల కాలంలో నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలోనే కృతి శెట్టి తెలుగు సినిమాలకు దూరమవుతూ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటున్న కృతి శెట్టికి అనిల్ రావిపూడి సినిమాలో అవకాశం రావడం అంటే ఈమెకు మంచి అవకాశం వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు. మరి కృతి శెట్టి ఫ్లాప్ సెంటిమెంటు నుంచి అనిల్ రావిపూడి తనని బయటపడేస్తాడా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మొత్తానికి, కృతి శెట్టిని అనిల్ రావిపూడి ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, ఈ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.