|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బ్రేకప్‌పై అర్జున్ దాస్ సంచలన ప్రకటన! ప్రేమలో విషాదం?

Published: 14-03-2026, 4:35 AM
షాకింగ్: బ్రేకప్‌పై అర్జున్ దాస్ సంచలన ప్రకటన! ప్రేమలో విషాదం?
  • ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తన బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
  • అర్జున్ దాస్ ప్రేమలో విఫలమయ్యారా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
  • అర్జున్ దాస్ పోస్ట్ సినిమా ప్రమోషన్ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
  • అర్జున్ దాస్ తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రముఖ నటుడు అర్జున్ దాస్ తన ప్రేమ వ్యవహారంపై సంచలన పోస్ట్ చేశారు. బ్రేకప్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అర్జున్ దాస్ బ్రేకప్ పోస్ట్ వైరల్

ArjunDas:సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో భాగంగానే ఈ ఏడాది ముఖ్యంగా యంగ్ హీరోలు, హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరికొంతమంది ప్రేమ అంటూ కొత్త తోడును వెతుక్కుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో మరికొన్ని జంటలు విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. ఇంకొంతమంది తమ ప్రేమలో విఫలమైనట్లు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన లవ్ బ్రేకప్ గురించి తొలిసారి స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రముఖ టాలీవుడ్ హీరో అర్జున్ దాస్ (Arjun das).

సహజ నటనతో, విలక్షణమైన గొంతుతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అర్జున్ దాస్.. తమిళ్ ,తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. విభిన్న కంటెంట్ చిత్రాలతో ఫాలోయింగ్ పెంచుకున్న ఈయన హీరో పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా పోషిస్తూ మెప్పిస్తున్నారు. ఎప్పుడూ సరదాగా కనిపించే అర్జున్ దాస్ సోషల్ మీడియా ద్వారా తన సినిమా విషయాలను అభిమానులతో పంచుకునేవారు. కానీ ఈసారి కాస్త భిన్నంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తన ఇన్స్టా స్టోరీ లో పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ప్రేమలో విఫలమయ్యారా?

విషయంలోకి వెళ్తే.. తాజాగా తన ఇన్స్టా స్టోరీలో అర్జున్ రాజ్ ఇలా రాసుకొచ్చారు. “మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే.. వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు?” అంటూ ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం అర్జున్ దాస్ చేసిన బ్రేకప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అర్జున్ నిజంగా అనే ప్రేమలో విఫలమయ్యారా ? ఆయన వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషాదం చోటు చేసుకుందా ? అసలు ప్రేమ గురించే బయట పెట్టలేదు అలాంటిది బ్రేకప్ ఏంటి? అంటూ చర్చ మొదలయ్యింది.

సినిమా ప్రమోషనా.. లేక నిజమా?

వాస్తవానికి తన అద్భుతమైన నటనతో నిత్యం వార్తల్లో నిలిచే అర్జున్ దాస్ ఏ రోజు కూడా ప్రేమ వార్తల్లో నిలవలేదు. కానీ సడన్గా ఇలా బ్రేకప్ పోస్ట్ పెట్టేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయనకు సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. మరి కొంత మంది ఇదేదో సినిమా అప్డేట్ లేదా ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బుట్ట బొమ్మ అనే సినిమాలో నటించారు. ఏది ఏమైనా అర్జున్ స్ ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .

అర్జున్ దాస్ బ్రేకప్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది నిజమైన బ్రేకపా లేక సినిమా ప్రమోషనా అనేది వేచి చూడాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.