
📌 Key Points
- నిర్మాత బన్నీ వాసు మిత్రమండలి సినిమాతో 6 కోట్ల నష్టం వచ్చిందని ఒప్పుకున్నారు.
- ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందని, అప్పట్లో ఒప్పుకోకపోయినా ఇప్పుడు వెల్లడించారు.
- కామెడీ వర్కౌట్ అవుతుందని భావించినా, ప్రేక్షకులు నవ్వకుండా ఉండిపోయారని ఆయన తెలిపారు.
- చిన్న సినిమాలతో విజయాలు సాధించే బన్నీ వాసు కెరీర్‌లో మిత్రమండలి ఒక అనూహ్య వైఫల్యం.
నిర్మాత బన్నీ వాసు సంచలన ప్రకటన చేశారు. తాను నిర్మించిన మిత్రమండలి సినిమాతో భారీ నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. సుమారు 6 కోట్ల రూపాయలు పోయాయని, సినిమా ఫెయిల్యూర్‌కు గల కారణాలను ఇంటర్వ్యూలో వివరించారు. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బన్నీ వాసు విజయ పరంపర
Bunny Vas : బన్నీ వాసు సినిమాలు అంటే… ఆడియన్స్‌కు ఓ నమ్మకం ఏర్పడింది. చిన్న సినిమాలు.. చిన్న కాస్టింగ్ ఉన్నా… ఆ సినిమాలు పెద్ద విజయం సాధిస్తాయి. ఇప్పటికే అది ప్రూవ్ అయింది. కానీ, ఓ సారి లెక్క తప్పింది. అదే మిత్ర మండలి. ఈ సినిమా రిలీజ్ టైంలో డిజాస్టర్ టాక్ వచ్చినా… వాళ్లు ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు బహిరంగంగా అది ఫెయిల్యూర్ మూవీ అని.. తమకు నష్టం తెప్పించిన మూవీ అంటూ చెప్పుకుంటున్నారు.
బన్నీ వాసు, వంశీ నందిపాటుతో పాటు మరి కొంత నిర్మాతలు కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అలా వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్ టాక్ తెచ్చుకుంటూనే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన ఈషా మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ వారం రిలీజ్ అయిన అరడజన్ సినిమాలకు ఈషా మంచి పోటీ ఇచ్చింది. కొన్ని ఏరియాల్లో లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గరలో ఉన్నాయని సమాచారం.
మిత్రమండలి: భారీ నష్టం, డిజాస్టర్ టాక్
ఇప్పటి వరకు బానే ఉన్నా… బన్నీ వాసు సమర్పణలో వచ్చిన ఓ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదే.. మిత్రమండలి. బన్నీ వాసు సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ & వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కల్యాణ్ మంతెన, భాను ప్రతాప్, డా. విజయేందర్‌రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకు ఎస్. విజయేంద్ర దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 16న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.
మొత్తంగా, సినిమా ఓ ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. అలాగే సినిమాకు భారీ నష్టం వచ్చిందని అప్పట్లో ఇండస్ట్రీ టాక్. తాజాగా ఆ సినిమా ఫెయిల్యూర్ గురించి.. నష్టాల గురించి నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. మిత్రమండలి సినిమాల తమకు 6 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఒప్పుకున్నాడు.
6 కోట్లు పోయాయి: బన్నీ వాసు ఒప్పుకోలు
సినిమా ఫైనల్ అవుట్ పుట్ వచ్చిన తర్వాత చూసి… కామెడీ వర్కౌట్ అవుతుందని అనుకున్నాడట. కొన్ని సీన్స్ వచ్చినప్పుడు థియేటర్‌లో జనాలు తప్పకుండా నవ్వుతారని అంచనా వేశాడట. కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్స్ వచ్చినప్పుడు జనాలు నవ్వకుండా ఉండిపోయారట. దీంతో ఈ సినిమా ఫెయిల్యూర్ అయిందని అప్పనుడే ఫిక్స్ అయ్యాడట. అలాగే ఈ సినిమా విషయంలో ఏదో మిస్ అయిందని.. ఏదో మిస్టేక్ జరిగిందని అనుకున్నాడట. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.
మిత్రమండలి సినిమా ఫెయిల్యూర్ బన్నీ వాసు కెరీర్‌లో ఒక అనూహ్య మలుపు. తన పొరపాట్లను అంగీకరించడం ద్వారా, ఆయన భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారనే ఆశ కలుగుతుంది. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీకి ఒక గుణపాఠంగా మారాయి.


