|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సెన్సార్ కత్తెర.. ‘చాయ్ వాలా’ ఇక ‘నవాబ్ కేఫ్’గా మారుతుందా?

Published: 10-02-2026, 3:05 PM
షాకింగ్: సెన్సార్ కత్తెర.. 'చాయ్ వాలా' ఇక 'నవాబ్ కేఫ్'గా మారుతుందా?
  • సెన్సార్ అభ్యంతరాల కారణంగా ‘చాయ్ వాలా’ టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చారు.
  • శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రల్లో నటించారు.
  • ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
  • దర్శకుడు ప్రమోద్ హర్ష, నిర్మాత రాధా వి పపుడిప్పు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని శివ కందుకూరి తెలిపారు.

సెన్సార్ బోర్డు అభ్యంతరాల నడుమ ‘చాయ్ వాలా’ సినిమా టైటిల్ మారింది. ఈ సినిమా ఇకపై ‘నవాబ్ కేఫ్’ పేరుతో విడుదల కానుంది. శివ కందుకూరి హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టైటిల్ మార్పుకు కారణం ఏమిటి?

Chai Wala: సెన్సార్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కోలీవుడ్ ఫిల్మ్ ‘జన నాయగన్’ విషయంలో తెలుస్తూనే ఉంది. సంక్రాంతికి రావాల్సిన ఆ సినిమా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో కూడా ఇప్పుడో సినిమాకు సెన్సార్ అభ్యంతరాలు ఏర్పడ్డాయి. అది స్టార్ హీరో సినిమా కూడా కాదు. ఒక చిన్న హీరో సినిమా. దీంతో ఈ సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేసి, మళ్లీ న్యూ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందుకు టైటిల్ మార్చాల్సి వచ్చింది? అనే విషయాల్లోకి వెళితే.. శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ సినిమాకు కొత్గా ‘నవాబ్ కేఫ్’ (Nawab Cafe) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతున్నారు.

‘నవాబ్ కేఫ్’గా కొత్త ప్రయాణం

ఈ సినిమా టైటిల్ మార్చడానికి కారణం ఏంటో చిత్ర హీరో శివ కందుకూరి చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ‘చాయ్ వాలా’ టైటిల్‌తో జర్నీ చేశాం. టైటిల్‌ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. సెన్సార్ దగ్గర కూడా ఈ సినిమాకు టైటిల్ అడ్డుపడింది. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ముందుగా నాకు ఈ కథను చెప్పినప్పుడు ‘నవాబ్ కేఫ్’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం. నా ఫోన్‌లో ప్రమోద్ పేరు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు విధి చివరకు ఆ టైటిల్‌‌నే పెట్టేలా చేసింది. ‘నవాబ్ కేఫ్’ టైటిల్ మా సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది. టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా చిత్ర రిలీజ్‌పై ఫోకస్ పెట్టారు.

ఫిబ్రవరి 20న విడుదల

‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తోనే మళ్లీ ప్రమోట్ చేద్దామని టీం అంతా అనుకున్నాం. అందుకే సినిమా విడుదలను ఫిబ్రవరి 20కి వాయిదా వేశాం. ఎంతో నిజాయితీతో, జెన్యూన్‌గా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఈ సినిమా అందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ వాళ్ల నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతారు. ఫిబ్రవరి 20న ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. ఇంత వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన అందరూ అదే సపోర్ట్ కొనసాగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

‘చాయ్ వాలా’ కాస్తా ‘నవాబ్ కేఫ్’గా మారినా, సినిమాలోని కథ, ఆత్మ మాత్రం మారలేదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.