
📌 Key Points
- టొవినో థామస్ ‘పళ్లిచట్టంబి’ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
- టీజర్ ఒక పురాతన చర్చి, దెయ్యాల్లాంటి మనుషుల నేపథ్యంలో సాగుతుంది.
- టీజర్లో హీరో ప్రజలను కాపాడేందుకు పోరాటం చేస్తున్నాడు.
- 50, 60 దశకాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన ‘పళ్లిచట్టంబి’ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
టీజర్ ఎలా ఉందంటే?
Pallichattambi Teaser: మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగు భాషలోనూ విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ (Pallichattambi) కూడా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ (Dijo Jose Antony) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా పీక్ స్టేజ్‌లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర టీజర్ (Pallichattambi Teaser)ని మేకర్స్ వదిలారు.
మనుషులు, సైతాను.. దేవుడితో పనేంటి?
సినిమా నేపథ్యం ఏంటి?
ఈ టీజర్‌ని గమనిస్తే.. ప్రఖ్యాతిగాంచిన ఒక పురాతన చర్చిని చూపిస్తూ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఆ భగవంతుడి ఆలయం మీద కొందరు దెయ్యాల్లాంటి మనషుల కన్నుపడుతుంది. ఆ రాక్షసులు అమాయకులైన ప్రజల్ని హింసించడాన్ని ఈ టీజర్‌లో చూపించారు. ‘మనుషులు, సైతాను ఎదురెదురుగా ఉండే ప్రదేశంలో దేవుడితో పనేంటి..’ అనే డైలాగ్ ఈ మూవీ నేపథ్యం, కథలోని కాన్‌ఫ్లిక్ట్ ఎలా ఉండబోతోందనే అంశాలపై క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఈ ఆలయాన్ని, అమాయక ప్రజల్ని కాపాడేందుకు హీరో ఎలాంటి పోరాటం చేశాడు అనేది టీజర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ సరికొత్తగా కనిపించి ఆకట్టుకుంటున్నారు.
ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టొవినో
‘పిశాచాలు ఉండే ప్రదేశం అది.. నీతో ఎన్ని సార్లు చెప్పాలి, ఆ ప్రదేశం వైపు కన్నెత్తి చూడవద్దని’, ‘ఆ సర్వేశ్వరుని అనుగ్రహం ఉంటే, ఈ దేవాలయంపై ఏ పిశాచి నీడ పడదురా’, అనే డైలాగ్స్, ఇందులోని పాత్రలు కనబడిన తీరు, బ్రిటీస్ నేపథ్యం ఇలా.. టీజర్‌లోని ప్రతి సీన్, సినిమాపై ఇంట్రస్ట్‌ని కలిగిస్తోంది. ముఖ్యంగా టొవినో థామస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉన్నాయి. కయదు పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా ఈ టీజర్‌లో చూపించారు. మొత్తంగా అయితే మలయాళం నుంచి సంచలనం సృష్టించడానికి మరో సినిమా వస్తుందనే ఫీల్‌ని ఈ టీజర్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ నెటిజన్లు ఈ టీజర్‌పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ‘పళ్లిచట్టంబి’ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. టొవినో థామస్ నటన, సినిమాలోని విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఏప్రిల్ 10 వరకు వేచి చూడాల్సిందే.


