
📌 Key Points
- ప్రకాష్ రాజ్ రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని హిందూ సంఘాల ఆగ్రహం.
- రామ లక్ష్మణులు వలస కూలీలంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న హిందూ సంఘాలు.
- ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని విమర్శలు.
- ప్రకాష్ రాజ్ రాబోయే సినిమాలపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన రాముడిని, లక్ష్మణుడిని వలస కూలీలుగా అభివర్ణించడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రామాయణంపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Prakash Raj : సినిమాలతో పాటు సెన్సేషన్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలిచే వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇపుడు మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యారు. అయితే ఆయన ఈసారి ఏకంగా హిందులందరు అత్యంత పవిత్రమైన రామాయణంపై వివాస్పద వ్యాఖ్యలు చేయడం ఇపుడు నేషనల్ వైడ్ గా మంటలు రాజేస్తుంది.
రామాయణంపై వింత కథ అల్లుతూ వివాస్పద కామెంట్స్
విషయంలోకి వెళ్తే ఒక ప్రైవేట్ వేదికపై ‘తూలిక పాలిటిక్స్’ or ‘సర్కాజం పాలిటిక్స్’ పేరుతో ఆయన చేసిన స్పీచ్ సంబంధించిన 106 సెకన్ల వీడియో క్లిప్ ఏప్రిల్ 14నే నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ముఖ్యంగా శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా దేశం మొత్తం శ్రీరాముని నామ స్మరణలో మునిగిన ఈ సమయంలోనే ఈ వీడియో బయటకు రావడం, అందులో ప్రకాష్ రాజ్ రామాయణంని వక్రీకరిస్తూ ఒక వింత కథను అల్లుతూ వివాస్పద కామెంట్స్ చేయడంతో దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమన్నాయ్.
రామ లక్ష్మణులు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వలస కూలీలంటూ
శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణులను ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వలస కూలీలని తన స్పీచ్ లో చెప్పుకొచ్చాడు. వాళ్ళు దక్షిణ భారతదేశంలోని ఒక పొలంలోకి ప్రవేశించి, అక్కడి పండ్లను దొంగిలించి తిన్నారని, ఆ సమయంలో ఆ పొలం యజమాని అయిన రావణుడితో వారికి గొడవ జరిగిందని ఎగతాళి చేశాడు. రావణుడు ఒక దక్షిణ భారత గిరిజనుడని, ఆ పండ్ల దొంగతనంపై ప్రశ్నించినప్పుడు అది కాస్తా పెద్ద వివాదంగా మారిందని, ఆఖరికి ఆ గొడవ రూ .2000 జీఎస్టీ బిల్లు చుట్టూ తిరుగుతూ యుద్ధానికి దారితీసిందంటూ రామాయణాన్ని వక్రీకరిస్తూ హేళన చేశాడు. ఇక 14న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దర్శనమివ్వగా ఏప్రిల్ 16 నాటికి వైరల్ అయిపోయింది.
ప్రకాష్ రాజ్ చేస్తున్న ‘విభజన రాజకీయాల్లో’ భాగం
హిందూ సంఘాల ఆగ్రహం, విమర్శలు
దీంతో ఈ కామెంట్స్ సెటైరికల్ గా హిందూ దేవుళ్లను అవమానించడమే కాకుండా భారత్ లోని ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని, ఇదంతా ప్రకాష్ రాజ్ చేస్తున్న ‘విభజన రాజకీయాల్లో’ భాగమంటూ ఫైర్ అయ్యాయి హిందూ సంస్థలు. ప్రకాష్ రాజ్ తన కామెంట్స్ ద్వారా ఆవు మాంసం తినే వాళ్ళని ఇన్ డైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నాడని, సొసైటీలో మతపరమైన చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న రాబోయే చిత్రాలపై కూడా ఈ కామెంట్స్ ఎఫెక్ట్ పడింది.
దృశ్యం 3, వారణాసిల నుండి ప్రకాష్ రాజ్‌ను తీసెయ్యాలి
ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్న ‘దృశ్యం 3’ నుండి ప్రకాష్ రాజ్‌ను తీసెయ్యాలని, అలాగే ఎస్.ఎస్. రాజమౌళి కూడా తన వారణాసి నుండి ప్రకాష్ రాజ్ ని తొలగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి ‘యాంటీ హిందూ’ వ్యక్తులకు అవకాశాలు ఇవ్వడం సిగ్గుచేటని, “మీరు ఒకవేళ ప్రకాష్ రాజ్‌ను మీ సినిమాల్లో కొనసాగిస్తే, మేము మీ సినిమాలను కూడా బాయ్ కాట్ చేస్తాం” అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ పై చట్టపరంగా కేసులు ఫైల్ చేయాలంటూ ప్రభుత్వ అధికారులను మరియు పోలీసు డిపార్ట్ మెంట్ ని ట్యాగ్ చేస్తున్నారు మరికొంతమంది నెటిజన్లు.
వారణాసి షూట్ అడ్డుకుంటామని వార్నింగ్
దీనికి తోడు ప్రకాష్ రాజ్ నటిస్తున్న మరో చిత్రం ‘వారణాసి’ని కూడా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి పలు హిందూ సంఘాలు. భారతీయ సంస్కృతికి, మూలాలకు వెన్నెముక లాంటి పురాణాలను ఇలా వక్రీకరిస్తూ కథలు అల్లడం, హేళన చేయడం ఏ మాత్రం క్షమించరానిదని రామ భక్తులు మండిపడ్డారు.
ఇంత వైరల్ అవుతున్నా స్పందించని ప్రకాష్ రాజ్
అయితే ఎప్పుడైనా తనపై వచ్చే కామెంట్స్ కి వెంటనే రియాక్ట్ అయ్యే ప్రకాష్ రాజ్ ఇష్యూ ఇంత వైరల్ అవుతున్నా స్పందించకపోవడం ఆశ్చర్యమే. మొత్తానికి వచ్చే మే నెలలో మొదలయ్యే సినిమాల షూటింగ్స్, ప్రమోషన్స్‌పై ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ గట్టిగానే పడేట్టు ఉంది. ఏదేమైనా తనదైన నటనతో మెప్పించే ప్రకాష్ రాజ్ ఇలా కాంట్రవర్సీలకి కేరాఫ్ అవడం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. చూడాలి మరి ప్రకాష్ రాజ్ రామాయణం పై చెప్పిన కథ ముందు ముందు ఇంకెన్ని మలుపులకి దారి తీస్తుందో!
ప్రకాష్ రాజ్ సినిమాలపై ప్రభావం?
Prakash Raj narrates a made up version of Ramayan to mock Hindus
-Ram JI was North Indian -Ravan was South Indian tribal -They became enemies bcz Ram Ji stole fruits from Ravan
And he made this blasphemous story only to promote beef eating and create north south divide
Shame… pic.twitter.com/HFAV95HXbR
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) April 16, 2026
ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదం ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.


