|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండెలు పిండేసిన పుష్ప 2 విషాదం: శ్రీతేజ్ కు అండగా అల్లు ఫ్యామిలీ.. వీడియో వైరల్!

Published: 07-05-2026, 12:01 AM
గుండెలు పిండేసిన పుష్ప 2 విషాదం: శ్రీతేజ్ కు అండగా అల్లు ఫ్యామిలీ.. వీడియో వైరల్!
  • పుష్ప 2 ప్రీమియర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తల్లిని కోల్పోయి, గాయపడిన శ్రీతేజ్.
  • అల్లు అరవింద్, స్నేహరెడ్డి శ్రీతేజ్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
  • శ్రీతేజ్ సోదరి ఉన్నత చదువుల ఖర్చును అల్లు అరవింద్ భరిస్తానని హామీ.
  • ఈ మానవత్వ చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్.

పుష్ప 2 ప్రీమియర్ వద్ద జరిగిన విషాదంలో తల్లిని కోల్పోయి, తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను అల్లు ఫ్యామిలీ పరామర్శించింది. అల్లు అరవింద్, స్నేహరెడ్డి శ్రీతేజ్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడమే కాకుండా, ఆయన సోదరి చదువు బాధ్యతను స్వీకరించారు. ఈ మానవత్వ చర్య అందరినీ కదిలిస్తోంది.

పుష్ప 2 ప్రీమియర్ విషాదం: అసలేం జరిగింది?

Allu Support: పుష్ప 2 రిలీజ్ టైమ్ లో సంధ్య థియేటర్ ఇష్యూ ఎంత సెన్సేషన్ అయ్యిందో చెప్పక్కర్లేదు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నా ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతిప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది.ఇక అదే ఘటనలో చావు అంచుల దాకా వెళ్ళిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా కోలుకుంటున్న శ్రీతేజ్ ని పరామర్శించి తమ మానవత్వాన్ని చాటుకుంది అల్లు ఫ్యామిలీ.

బాధిత కుటుంబం వద్దకు అల్లు అరవింద్, స్నేహ రెడ్డి

తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న శ్రీతేజ్ ఇంటికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి వెళ్లారు. కేవలం పరామర్శించడమే కాకుండా, ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తల్లిని కోల్పోయి, తను కూడా చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అరవింద్ స్వయంగా ఆరా తీశారు. “ఏం పర్వాలేదు, మేమున్నాం” అంటూ ఆయన ఇచ్చిన భరోసా ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది.

శ్రీతేజ్ సోదరి చదువు బాధ్యత నాదే

శ్రీతేజ్ కు అండగా అల్లు ఫ్యామిలీ పరామర్శ

ఈ పరామర్శలో అల్లు అరవింద్ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీతేజ్ సోదరి భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దని, ఆమె చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ఆయన హామీ ఇవ్వడం మెచ్చుకోతగ్గ విషయం.”డబ్బుతో పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ ఒక బిడ్డ భవిష్యత్తును మాత్రం తీర్చిదిద్దగలం. ఆ అమ్మాయిని ఉన్నత చదువులు చదివించే బాధ్యత నాది అని చెప్పడం బట్టి చూస్తె అల్లు ఫ్యామిలీ ఆ కుటుంబం పట్ల ఎంత కన్సర్న్ చూపిస్తుందో అర్థం అవుతుంది.

డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీగా పోగయ్యారు జనాలు. ఇక అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చూడాలనే ఉత్సాహంలో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో శ్రీతేజ్ కూడా కోమాలోకి వెళ్లిపోయాడు. అలా చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చావుతో పోరాడి, ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.అలా మొత్తానికి రికవరీ అయిన శ్రీతేజ్ ని ఈరోజు మరోసారి పరామర్శించి భరోసా ఇచ్చింది అల్లు ఫ్యామిలీ.

ఇక ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అరవింద్ స్వయంగా వెళ్లి, ఆ అమ్మాయి చదువు బాధ్యత తీసుకోవడంతో ఇదీ అల్లు అర్జున్ కమిట్ మెంట్ అంటూ మరోసారి ఆకాశానికి ఎత్తేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ !

శ్రీతేజ్ సోదరి చదువు బాధ్యత అల్లు అరవింద్ దే

#AlluAravind & #AlluSneha visited #SriTej ’s home, extending their continued support and care, just as always.

Their Genuine Efforts & approach may result in that little one’s full recovery pic.twitter.com/nB08D1Llhr

— Taraq(Tarak Ram) (@tarakviews) May 6, 2026

అల్లు ఫ్యామిలీ చూపిన ఈ మానవత్వం, బాధితులకు అండగా నిలబడటం ఎంతో ప్రశంసనీయం. డబ్బుతో ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా, ఒక కుటుంబానికి భవిష్యత్తును ఇవ్వడం ద్వారా వారు గొప్ప ఆదర్శాన్ని చాటారు. ఈ సంఘటన అందరికీ స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.