
📌 Key Points
- రామ్ చరణ్ ను పూర్తిస్థాయి నటుడిగా మార్చిన చిత్రం రంగస్థలం.
- సుకుమార్ మొదట ఈ కథను మహేష్ బాబుకు వినిపించారు, కానీ ఆయనకు నచ్చలేదు.
- చిరంజీవి సింగిల్ సిట్టింగ్ లోనే రామ్ చరణ్ తో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా అనుకున్నా, తర్వాత సమంతను ఎంపిక చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ‘రంగస్థలం’ ఒక ప్రత్యేకమైన చిత్రం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా వెనుక జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
రామ్ చరణ్ నటుడిగా ఎలా మారారు?
Rangasthalam:రంగస్థలం.. ఇది సినిమా మాత్రమే కాదు మెగా సన్ రామ్ చరణ్ (Ram Charan) ను పూర్తిస్థాయిలో నటుడిగా మలిచిన చిత్రం కూడా.. ఈ సినిమాకి ముందు నటుడిగా మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ లతో పర్వాలేదనిపించుకున్న రామ్ చరణ్.. ఈ సినిమాలో అవయవ లోపం (చెవిటివాడు) ఉన్న వ్యక్తి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో పూర్తిస్థాయి నటుడిగా అవతరించి.. అందరి దృష్టిని ఆకర్షించారు.” మెగాస్టార్ కొడుకా మజాకా” అనే రేంజ్ లో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు రామ్ చరణ్. లఇకపోతే రామ్ చరణ్ ను అంతలా ఉత్తమ నటుడిగా తీర్చిదిద్దన ఈ చిత్రానికి అప్పట్లో నేషనల్ అవార్డు కూడా వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ అవేవీ జరగలేదు. ఇదిలా ఉండగా రంగస్థలం సినిమా వచ్చి నేటికి ఎనిమిది సంవత్సరాలు.. ఈ సందర్భంగా తెర వెనుక జరిగిన విషయాలు.. మనకు తెలియని ఎన్నో విషయాలను నేడు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం రంగస్థలం. 2018 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయంతో సెన్సేషన్ హిట్ అందుకుంది. ఇకపోతే నేటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. సుకుమార్ మహేష్ బాబుతో చేసిన ‘వన్ నేనొక్కడినే’ సినిమా తర్వాత ఈ కథను అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలకి ఈ కథను వినిపించారు కూడా.. అయితే వారు పెద్దగా ఇంప్రెస్ అవ్వకపోవడంతో రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది. అయితే రామ్ చరణ్ , చిరంజీవి దగ్గరుండి మరీ ఈ కథను విని సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిట్టి బాబు పాత్రను ముందుగా చేపలు పట్టే జాలరిగా డిజైన్ చేసి, ఆ తర్వాత పంట పొలానికి నీళ్లు పెట్టే వ్యక్తిగా మార్చారట.
సుకుమార్ ఎవరికి కథ వినిపించారు?
ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు ఈ సినిమాలోని చాలా సన్నివేశాలకు సహాయం చేశారట. ముందుగా రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ అనుకున్నారు. ఆమెతో స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమెను వద్దనుకొని కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నారట. చివరికి సమంతను ఓకే చేశారు. అయితే ఆ తర్వాత కాలంలో అనుపమాకు అవకాశాలు తగ్గిపోయాయి. రంగస్థలం వదులుకోవడం వల్లే ఆమెను దూరం పెట్టారు అనే వార్తలు వచ్చాయి. కానీ కిష్కిందపురి సినిమా సమయంలో అసలు రంగస్థలం సినిమాకు తనను సంప్రదించనే లేదు అని, అదంతా పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది అనుపమ పరమేశ్వరన్.
ఈ సినిమాలో చిట్టి బాబు పాత్ర ఎంత హైలెట్ అయిందో రంగమ్మత్త పాత్ర కూడా అంతే హైలెట్ అనే చెప్పాలి. మొదట ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ రాశిని అడిగారు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో అనసూయను రంగంలోకి దింపారు. ఇక ఈ పాత్ర ఆమెకు పూర్తిస్థాయిలో ఇమేజ్ ను అందించడమే కాకుండా ఆమెకు రంగమ్మత్త అనే పేరు కూడా పడిపోయింది. ఇక ఇందులో విలన్ గా జగపతిబాబు, చిట్టిబాబుకి అన్నయ్యగా ఆది పినిశెట్టి అందరూ చాలా అద్భుతంగా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
హీరోయిన్ గా అనుపమను ఎందుకు తొలగించారు?
60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. ఫుల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 122.47 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ చిత్ర పాటలను చంద్రబోస్ కేవలం నాలుగు రోజుల్లోనే ఆరు పాటలను రాయడమే కాకుండా ట్యూన్స్ కూడా కంపోజ్ చేశారు. ఇకపోతే నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత నుంచి రిలీజ్ అయిన మొదటి ఫిలిం కూడా ఇదే కావడం విశేషం. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా, సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఇలా పూర్తిస్థాయిలో ఈ సినిమా అప్పట్లో అందరి దృష్టిని ఆకట్టుకొని ఇప్పటికీ టీవీలలో మంచి టీ ఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది.
రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.


