
📌 Key Points
- శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ అమెజాన్ ప్రైమ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
- ఈ సినిమా థియేటర్లలో ఆశించినంత విజయం సాధించకపోయినా, ఓటీటీలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది.
- సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.
- శర్వానంద్ కెరీర్‌కు ఈ సినిమా ఒక మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
ఓటీటీలో నెంబర్ వన్ స్థానంలో శర్వా మూవీ
Nari Nari Naduma Murari: సంక్రాంతి బరిలో చివరిగా థియేటర్లలోకి వచ్చిన చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) చిత్రం అనూహ్యమైన సక్సెస్‌ను అందుకుంది. కామెడీకి పెద్ద పీట వేస్తూ వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫలితంగా శర్వానంద్‌కు కూడా మంచి హిట్ పడింది. కాకపోతే థియేటర్లు సరిగా లభించకపోవడంతో సినిమా కలెక్షన్ల విషయంలో నిరాశ పరిచిందనే చెప్పాలి. అదే సోలోగా రిలీజై ఉంటే రూ. 100 కోట్లను ఈజీగా కలెక్ట్ చేసేది. మంచి ఛాన్స్‌ని మేకర్స్ మిస్సయ్యారు. ఇక థియేటర్లలో ఆలస్యంగా విడుదలైనా, ఓటీటీలో మాత్రం ముందుగానే ఈ సినిమా పలకరించింది. ఓటీటీలోనూ ఈ సినిమా అద్భుతమైన ఆదరణను అందుకుంటోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చాలా తక్కువ టైమ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రైమ్ వీడియో ఓటీటీ అధికారికంగా పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా, థియేటర్లలో ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. కానీ, థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో జనాలు ఈ సినిమాను మిస్ చేశారు. అందుకే ఓటీటీలో ఎగబడి చూస్తున్నారు. అందులో థియేటర్లలోకి వచ్చిన చాలా తక్కువ టైమ్‌లోనే ఓటీటీలో విడుదలవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. అందుకే డిజిటల్ ఎంట్రీ ఇవ్వగానే వీక్షకులు నెంబర్ వన్‌లో పెట్టేశారు. గత కొన్నాళ్లుగా హిట్ లేక సతమతమవుతున్న శర్వానంద్‌కు ఈ సినిమా కొత్త ఊపిరిని ఇచ్చింది. మంచి సక్సెస్ కొట్టడంతో ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అటు నిర్మాత కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ వచ్చినందుకు సంతోషాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఓటీటీ రైట్స్ తీసుకున్న అమెజాన్ కూడా ఫుల్ హ్యాపీ.
థియేటర్లలో రిలీజ్ ఆలస్యం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ
శర్వానంద్ సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫిబ్రవరి 4న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీకి వచ్చి, ఒకే ఒక్క రోజులోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 1లోకి రావడం నిజంగా, సినిమా సక్సెస్ రేంజ్ ఏంటనేది తెలియజేస్తుంది. ఈ దెబ్బతో శర్వానంద్ ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా అయితే శర్వా అకౌంట్‌లో మంచి హిట్ మాత్రం పడింది.
Trending #1 on @PrimeVideoIN ! The Sankranthi winner is now your OTT Winner! 🥇😎
The love for #NariNariNadumaMurari just keeps growing.❤️ #NariNariNadumaMurariOnPrime , Watch Now 💥 https://t.co/vrkpxSXrbF
శర్వానంద్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన సినిమా
Charming Star @ImSharwanand @AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 … pic.twitter.com/wPwYNPUlTZ
— AK Entertainments (@AKentsOfficial) February 5, 2026
మొత్తానికి శర్వానంద్ మూవీ ఓటీటీలో మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారికి ఓటీటీ ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా శర్వానంద్ కెరీర్ కి ఒక బూస్ట్ లాంటిది.


