|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Suriya 47 : ఆ విలక్షణ దర్శకుడు తో సూర్య, హీరోయిన్ గా నజ్రియా

Published: 07-12-2025, 11:49 AM
Suriya 47 : ఆ విలక్షణ దర్శకుడు తో సూర్య, హీరోయిన్ గా నజ్రియా
  • సూర్య 47 సినిమా పూజ అధికారికంగా మొదలైంది.
  • జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్నారు.
  • నజ్రియా నజీమ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనున్నారు.
  • ‘ప్రేమలు’ ఫేమ్ నస్లన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 47వ సినిమాను జీతూ మాధవన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఈరోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా మొదలైంది. ఇందులో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సూర్య 47: దర్శకడు జీతూ మాధవన్

Suriya 47 : కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా విపరీతమైన గుర్తింపు సాధించుకున్నారు సూర్య. సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు చేయడం అక్కరలేదు. ఎందుకంటే సూర్య చాలామంది తెలుగు ప్రేక్షకులకు కూడా తమిళ్ హీరో అని తెలియదు. ఇదే విషయాన్ని సూర్య కూడా ఒక ఈవెంట్ లో ప్రస్తావిస్తూ మాట్లాడారు.

ఇకపోతే సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ సినిమాను చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ వంశీ ప్రస్తుతం కేవలం తెలుగు హీరోలతో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో ఉన్న టాప్ హీరోలతో ప్రాజెక్టు సెట్ చేసి మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. ఇప్పటికే ధనుష్ హీరోగా సార్ సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన లక్కీ భాస్కర్ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ రెండు సినిమాలకు కూడా దర్శకత్వం వహించింది వెంకీ అట్లూరి.

ఇప్పుడు తమిళ్ హీరో సూర్యతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి. మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే సూర్య తన 47వ సినిమాను జీతూ మాధవన్ దర్శకత్వంలో చేయనున్నాడు.

నజ్రియా, నస్లన్ ల కీలక పాత్రలు

జీతూ మాధవన్ రోమంచం సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అతను చేసిన ఆవేశం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. అయితే ఇతని దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తాడు అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ సినిమాకి సంబంధించిన పూజ ఈరోజు అధికారికంగా మొదలైంది. అయితే ఈ ప్రాజెక్టులో నజ్రియా నజీమ్ లీడ్ రోల్ లో కనిపిస్తుంది.

అలాగే నస్లన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నస్లన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రేమలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ మలయాళం లో అందుకున్నాడు. మళ్ళీ ప్రేమలు సినిమాని తెలుగులో డబ్ కూడా చేశారు. ఆ ప్రేమలు సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆదరించారు

ప్రస్తుతం సూర్య 46 వివరాలు

ఇక రీసెంట్ గా వచ్చిన కొత్త లోక సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు నస్లన్. ఇప్పుడు నస్లన్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా కథను పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు అనే స్థాయి నమ్మకం కూడా సంపాదించుకున్నాడు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో రివీల్ చేయనున్నారు.

మొత్తం మీద, సూర్య 47 సినిమా అనౌన్స్‌మెంట్ తో అభిమానుల్లో ఉత్సాహం నిండింది. జీతూ మాధవన్, నజ్రియా, నస్లన్ వంటి టాలెంటెడ్ నటుల కలయిక సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.