
📌 Key Points
- టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఓటీటీ షోలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారు.
- తేజ సజ్జ ‘ది ట్రైటర్స్’ సౌత్ వెర్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
- కిరణ్ అబ్బవరం ‘గువ్వలచెరువు ఘాట్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.
- హీరోలు ఓటీటీల ద్వారా గ్లోబల్ రీచ్ పెంచుకోవడంతో పాటు భారీ రెమ్యూనరేషన్ పొందుతున్నారు.
ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించే టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లపై కూడా సందడి చేస్తున్నారు. అవకాశాలు తగ్గిపోతున్నాయా లేక ఇది బిజినెస్ ప్లానా అనే చర్చ జరుగుతోంది. తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం వంటి నటులు ఈ మార్పులో భాగస్వాములవుతున్నారు.
ఓటీటీలకు టాలీవుడ్ హీరోల జంప్
Tollywood: ఒకప్పుడు సినిమా స్టార్ అంటే కేవలం 70mm వెండితెరపై మాత్రమే కనిపించే ఒక అద్భుతం. టీవీ వైపు చూడటమే తక్కువగా భావించే ఆ కాలం పోయి, ఇప్పుడు ఓటిటి షోలు, వెబ్ సిరీస్‌లే గతి అనే స్థాయికి టాలీవుడ్ హీరోలు చేరిపోయారు. అమితాబ్ బచ్చన్ ‘కేబీసీ’తో వేసిన బాటలో ఇప్పుడు మన కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు. ఇది పక్కా బిజినెస్ ప్లానింగా? లేక వెండితెరపై అవకాశాలు తగ్గిపోతున్నాయన్న భయమా? అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ ఇప్పటికే టీవీ హోస్టింగ్‌తో కోట్లు వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘హనుమాన్’ స్టార్ తేజ సజ్జ చేరిపోయాడు. ప్రముఖ అంతర్జాతీయ షో ‘ది ట్రైటర్స్’ సౌత్ వెర్షన్‌కు హోస్ట్‌గా తేజ అధికారికంగా సంతకం చేశాడు. పాన్ ఇండియా హిట్ కొట్టిన జోష్‌లో పెద్ద సినిమాలు చేయాల్సింది పోయి, ఇలా సెలబ్రిటీ షోలకు పరిమితమవ్వడం కొందరికి ‘స్మార్ట్ మూవ్’ అనిపిస్తుంటే, మరికొందరికి మాత్రం ఇది హీరోగా మార్కెట్ మీద నమ్మకం లేక తీసుకున్న నిర్ణయమా అన్న సందేహాన్ని కలిగిస్తోంది.
కేవలం తేజ మాత్రమే కాదు, కిరణ్ అబ్బవరం కూడా తన దారి మార్చుకున్నాడు. ప్రైమ్ వీడియోలో ‘గువ్వలచెరువు ఘాట్’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. థియేటర్లలో వరుస ఫ్లాపులు పలకరించడంతో, సేఫ్ జోన్ కోసం ఓటిటి పంచన చేరాడనే నెగిటివ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ, టీజర్ చూసిన వారు మాత్రం కిరణ్ అబ్బవరం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. అటు నాగ చైతన్య ‘దూత’ సీజన్-2 కోసం సిద్ధమవుతుంటే, ఇటు యంగ్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లే దిక్కని ఫిక్స్ అయిపోతున్నారు. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి ఏడాదికి 10 సినిమాలు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కెరీర్ మొత్తం మీద 50 సినిమాలు చేయడం కూడా అసాధ్యంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువైతే జనం ఎక్కడ మర్చిపోతారో అన్న భయం హీరోలను వెంటాడుతోంది. అందుకే తెలివిగా మార్కెట్ విస్తరణ పేరుతో అదనపు ఆదాయం కోసం, నిరంతరం స్క్రీన్ మీద కనిపించడం కోసం ఇలాంటి షోలు, సిరీస్‌లను ఆశ్రయిస్తున్నారు.
హోస్ట్‌గా తేజ సజ్జ.. వెబ్ సిరీస్‌లో కిరణ్
దీనివల్ల హీరోలకు భారీ రెమ్యూనరేషన్ దక్కడంతో పాటు, ఓటిటిల ద్వారా గ్లోబల్ రీచ్ పెరుగుతుంది. ఫ్యాన్స్‌కు తమ హీరో ఎప్పుడూ కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దీనివల్ల వెండితెరపై ఉండే ఆ ‘మిస్టరీ’ క్రమంగా చచ్చిపోతోంది. ప్రతి వీకెండ్ టీవీలో ఉచితంగా కనిపించే హీరో కోసం థియేటర్లకు వెళ్లి రూ. 300 టికెట్ పెట్టి చూడాలా? అనే ఆలోచన సామాన్య ప్రేక్షకుల్లో కలిగే ప్రమాదం ఉంది. మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోలు పాత కండిషన్లను పక్కన పెట్టేసి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇది వాళ్ళ కెరీర్‌కు మైలేజ్ ఇస్తుందో లేక స్టార్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందో కాలమే నిర్ణయించాలి.
ఓటీటీతో పెరుగుతున్న గ్లోబల్ రీచ్
మొత్తానికి, టాలీవుడ్ హీరోలు ఓటీటీల వైపు మొగ్గు చూపడం అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తుంది. ఇది వారికి కొత్త అవకాశాలను తెస్తుంది, అలాగే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఉపయోగపడుతుంది.


