
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ‘విరోష్’ పేరుతో జరిగింది.
- వివాహం తర్వాత రష్మిక మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
- విజయ్ తన భార్య రష్మికకు ‘ఐ లవ్ యు జయమ్మ’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- రణబాలి సినిమాలో జయమ్మ పాత్రను విజయ్ రివీల్ చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా విజయ్ తన ప్రేమను వ్యక్తపరిచారు.
విజయ్, రష్మికల వివాహ బంధం
గత ఎనిమిది సంవత్సరాలుగా ఊరిస్తూ ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరు.. ఈ ఏడాది అభిమానులు ముద్దుగా పెట్టుకున్న “విరోష్” అనే పదాన్ని స్వీకరిస్తూ..”ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అంటూ సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇకపోతే వివాహం చేసుకున్న తర్వాత రష్మిక మందన్న జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా భార్యపై తనకున్న ప్రేమను వలకబోస్తూ విజయ్ స్పెషల్ గా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ..” ఐ లవ్ యు జయమ్మ” అంటూ ఆమెపై ప్రేమ కురిపించారు.. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
చిత్ర పరిశ్రమలో ఎంతో క్యూట్ గా.. చూసే వారికి అసూయ కలిగేలా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎప్పుడూ కూడా స్పెషల్ అనే చెప్పాలి. అందుకే ఈ జంట ఎక్కడ కనిపించినా సరే వీరితో ఒక్క ఫోటో దిగాలని కోరుకునే అభిమానులు కోకొల్లలు. ఇకపోతే ప్రాణ స్నేహితుడు , ప్రాణ స్నేహితురాలు పెళ్లి పేరుతో ఒక్కటైన వేళ .. తమ జీవితంలో జరిగే ప్రతిఘటన ఒక అద్భుతమే. ఈ క్రమంలోనే వివాహం తర్వాత తన భార్య మొదటి పుట్టినరోజు రావడంతో ఆయన ఎంతో ఉప్పొంగిపోయారు. తన భార్యకు ఏదైనా స్పెషల్గా విషెస్ చెప్పాలని అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వీరిద్దరూ కలసి జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా నుండి జయమ్మ పాత్రను రివీల్ చేస్తూ చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోని పంచుకుంది.
రష్మికకు విజయ్ స్పెషల్ విషెస్
ఇక తన భార్యకు ఇంతకంటే మంచి విషెస్ ఇంకోటి ఉండదు అనుకున్నారేమో ఆయన.. అందుకే తన భార్యకు ఆ వీడియోనే షేర్ చేస్తూ ఐ లవ్ యు జయమ్మ అంటూ ముద్దుగా తన ప్రేమను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ తన భార్యపై చూపించిన ప్రేమకు అభిమానులు, నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. జయమ్మ పై ఆయన కురిపించే ప్రేమ వర్ణనాతీతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రణబాలిలో రష్మిక ‘జయమ్మ’ లుక్
రష్మిక మందన్న విషయానికి వస్తే.. కన్నడ బ్యూటీ అయిన ఈమె ఛలో అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందుకుంది. అలా గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు చేసి మెప్పించింది. ఇక ఆ తర్వాత గత మూడేళ్లుగా వరుస చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటోంది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, సికందర్ , ది గర్ల్ ఫ్రెండ్ ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషా ప్రేక్షకుడిని మెప్పిస్తూ నేడు పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతోంది . అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై కూడా మెరుస్తూ గ్లోబల్ స్టేటస్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక.
విజయ్ దేవరకొండ తన భార్యపై చూపించిన ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. రష్మిక మందన్న పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


